Saturday, May 4, 2024

ఆటకు ఆటంకం కలిగితేనే ‘రిజర్వ్‌డే’!

- Advertisement -
- Advertisement -

Reserve if the game is interrupted!:WTC final

డబ్ల్యూటిసి ఫైనల్ నిబంధనలు ఖరారు

దుబాయి: భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించిన నిబంధనలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తామని ఐసిసి వెల్లడించింది. నిర్ణీత కాల వ్యవధిలో ప్రతికూల వాతావరణం వల్ల ఆటకు ఆటంకం కలిగితేనే రిజర్వ్‌డేగా ప్రకటించిన ఆరో రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ వర్షం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఐదు రోజుల ఆటలో ఎలాంటి ఆటంకం కలుగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ట్రోఫీని బహూకరిస్తామని ఐసిసి స్పష్టం చేసింది. ఒక వేళ వర్షం తదితర కారణాలతో ఐదు రోజుల ఆటకు ఎలాంటి ఆటంకం కలుగక పోతే ఆరో రోజు ఆటను నిర్వహించమని ఐసిసి వెల్లడించింది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వ్‌డేను కేటాయిస్తామని వివరించింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు కొనసాగుతుందని ఐసిసి పేర్కొంది.

ఇక జూన్ 23ను రిజర్వ్‌డేగా ప్రకటించినట్టు తెలిపింది. రిజర్వ్‌డేను కేవలం ఐదు రోజుల్లో నష్టపోయే సమయాన్ని ఉపయోగించుకునేందుకు మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ రిజర్వ్‌డే ఆరంభంలోనే ఒకవేళ 90 ఓవర్ల ఆట పూర్తయితే మ్యాచ్‌ను అక్కడే నిలిపివేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసిసి వివరించింది. ఇక ఫలితంతో రిజర్వ్‌డేకు ఎలాంటి సంబంధం లేదని ఐసిసి పేర్కొంది. ఇక రిజర్వ్‌డేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం మ్యాచ్ రిఫరీకి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

దీన్ని ఉపయోగించుకోవాలా లేదా అన్నది మ్యాచ్ రఫరీ నిర్ణయిస్తాడు. అది కూడా ఐదో రోజు చివరి గంటలో సమీక్షించి మాత్రమే రిఫఱీ నిర్ణయం తీసుకుంటాడని ఐసిసి వెల్లడించింది. ఇక మ్యాచ్‌లో పూర్తిగా గ్రేడ్ 1 డ్యూక్ బంతుల్ని మాత్రమే వినియోగిస్తున్నట్టు తెలిపింది. మైదానంలోని అంపైర్లు చెప్పగానే మూడో అంపైర్ షార్ట్న్‌ప్రై సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తాడని, ఇక ఎల్బీడబ్లూ, డిఆర్‌ఎస్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని వివిరించింది. ఇక డబ్లూటిసి ఫైనల్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు, ఇరు జట్ల క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఐసిసి ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News