Tuesday, April 30, 2024

రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్టీఆర్‌ ఏమన్నారంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్​ టైగర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా.. అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘన విజయం సాధించిన సందర్భంగా యంగ్​ టైగర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో ఆయన ముచ్చటించారు.

సక్సెస్‌, ఫెయిల్యూర్‌ పట్టించుకోను

నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సుమారు 20 యేళ్లు అవుతోంది. 17 ఏళ్ల వయస్సలో పరిశ్రమలోకి వచ్చాను. ఆ సమయంలో హిట్‌ వచ్చినా, ఫ్లాప్‌ వచ్చినా.. ఎక్కువగానే తీసుకునేవాడిని. కానీ, ఇప్పుడు దేనినైనా సులభంగా తీసుకోవడం అలవాటైంది. విజయం వచ్చినప్పుడు దక్కే ఆనందాన్ని, పరాజయం వచ్చినప్పుడు కలిగే బాధను.. ఆ క్షణానికే తీసుకుంటా. వెంటనే దాని నుంచి తేరుకొని మళ్లీ నా పని నేను చూసుకుంటాను. ప్రతి ఫెయిల్యూర్‌ ఏదో ఒకటి నేర్పుతుందని వ్యక్తిగతంగా నమ్ముతాను. ఒకసారి జరిగిన తప్పును గ్రహించి మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా.

గేటు దాటితేనే ఎన్టీఆర్‌

ప్రతిఒక్కరూ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్‌ చేసుకుంటేనే సంతోషంగా ముందుకు వెళ్లగలమని నమ్ముతుంటాను. అదే మాదిరిగా సినిమా సెట్‌లో ఉన్నంతవరకే ఒక నటుడ్ని, ‘ఎన్టీఆర్‌’ అనే స్టార్‌ని అనుకుంటా. ఒక్కసారి సెట్‌ నుంచి బయటకు రాగానే నేనూ ఒక సాధారణ వ్యక్తినే అని భావిస్తా.  ఇంటి గేటు దాటి బయటకు రాగానే మళ్లీ ‘ఎన్టీఆర్‌’ అని ఫీల్‌ కలుగుతుంది.

వాళ్లు రక్త సంబంధీకులు కాదు కానీ

మా తాతయ్య ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. సొసైటి మనకు ఎంతో ఇస్తుంది. మనం కూడా ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. ముఖ్యంగా ఎలాంటి రక్తసంబంధం లేకపోయినప్పటికీ ఎంతోమంది నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. నేను బాధలో ఉంటే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. నేను సంతోషంగా ఉంటే వాళ్లు మరింత ఆనందంగా ఉంటారు. ఏం చేసి వాళ్లకు ప్రేమను తిరిగి ఇవ్వగలను. మంచి సినిమాలు చేసి వాళ్లని గర్వపడేలా చేయడం తప్ప.

రాజకీయాల్లోకి

రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎంతో మంది అడుగుతున్నారు. నేను భవిష్యత్తు గురించి నమ్మను. కేవలం ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే వ్యక్తిని. ప్రస్తుతం ఒక నటుడిగా ఈ ప్రయాణాన్ని అన్నివిధాలుగా ఎంజాయ్‌ చేస్తున్నా. నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో సంతృప్తిగా ఉన్నాను.

Jr NTR about His Political Entry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News