Thursday, May 2, 2024

కాబూల్ స్కూలు బాంబు దాడిలో 50కి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Kabul school bombing death toll rises to 50

 

కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని సయ్యద్ అల్ షహ్దా బాలికల పాఠశాల వద్ద శనివారం జరిగిన బాంబుదాడిలో మృతుల సంఖ్య 50కి చేరుకుంది. చనిపోయిన వారిలో చాలా మంది 11నుంచి 15 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కాగా ఆదివారం మృతులకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ దాడిలో మరో వందమంది దాకా గాయపడారని హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ చెప్పారు. కాగా దాడి జరిగిన దషత్ ఎబరూచి ప్రాంతలో అత్యధికులు షియా ముస్లింలే. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు బాంబుదాడులు జరిగాయి. పదేపదే జరుగుతున్న దాడులనుంచి తమకు రక్షణ కల్పించని ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం దాడి జరిగిన తర్వాత స్పందిస్తోంది తప్ప ముందు ఏమీ చేయడం లేదని శనివారం దాడిలో11వ తరగతి చదువుతున్న తన మేనకోడలు లతీఫా అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన మమ్మద్ బాకిర్, అఈజాదాలు చెప్పారు. అఫ్ఘానిస్థాన్‌నుంచి నాటో దళాలు పూర్తిగా ఉపసంహరించుకున్న కొద్ది రోజులకే ఈ దాడి జరగడంతో మరిన్ని దాడులు జరుగుతాయేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ దాడికి పాల్పడింది తాము కాదని తాలిబన్ ప్రకటించింది. అయితే మరే ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడేది ఐఎసిస్ మాత్రమేనని తాలిబన్ విమర్శించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News