Sunday, May 5, 2024

గాలిలో కరోనా వైరస్ ప్రభావం

- Advertisement -
- Advertisement -

Virus spread up to 6 feet from an infected person:CDC

 

వైరస్ సోకిన వ్యక్తి నుంచి 6 అడుగుల వరకు వ్యాప్తి
వెంటిలేషన్ లేకుంటే ఇంకా ఎక్కువ దూరం
వైరస్ బాధితుని వెంట ఎవరైనా వెళ్తే రిస్కు ఎక్కువ
ఇండోర్ ప్రాంతాల్లో గుంపులుగా ఉండరాదు
అమెరికా సిడిసి తాజా మార్గదర్శకాలు

వాషింగ్టన్ :గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని, వైరస్ సోకిన వ్యక్తి నుంచి 3 నుంచి 6 అడుగుల లోపు వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుందని అలాగే సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (సిడిసి) స్పష్టం చేసింది. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాపించే అవకాశం ఉంటుందని సిడిసి తాజా మార్గదర్శకాల్లో వివరించింది. వైరస్ సోకిన వ్యక్తులు శ్వాసించినప్పుడు వారి నుంచి వెలువడే స్వల్ప శ్వాస బిందువుల ద్వారానే వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటికే వెల్లడైంది. అయితే వైరస్ కణాలు ఎంత దూరం వ్యాపిస్తాయో సిడిసి స్పష్టం చేసింది. మూడు విధాలుగా వైరస్ వ్యాపిస్తుందని, 1. అతి చిన్న శ్వాసకోశ కణాలను నేరుగా పీల్చడం, 2. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నేరుగా ఇతరుల ముక్కు, నోరు వంటి శ్లేష్మ పొరలపై వైరస్ కణాలు చేరడం, 3.వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం, వల్ల వైరస్ మరొకరికి సంక్రమిస్తుందని సిడిసి వివరించింది. సిడిసి మరిన్ని హెచ్చరికలు చేసింది.

1. వెంటిలేషన్ అంటే గాలి బయటకు వెళ్ల లేని ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. 2. వైరస్ సోకిన వ్యక్తి ఇండోర్ ప్రదేశాల్లో 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు ఉన్నట్టయితే వైరస్ వ్యాప్తి ఆరు అడుగుల కన్నా ఎక్కువగా ఉంటుంది.౩. కొన్ని కేసుల్లో వైరస్ బాధితుడు వెళ్లిన మార్గంలో ఎవరైనా వెంటనే వెళ్తే వారికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. 4. విడుదలయ్యే సూక్ష్మ బిందువుల్లో పెద్ద సైజులో ఉన్నవి కొన్ని నిముషాల్లోనే నేలపై పడిపోతాయి. 5, స్వల్ప పరిమాణంలో మిగిలిపోయినవి ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు గాలిలో క్రియాశీలంగా ఉంటాయి. 6. ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమ పరిస్థితుల ప్రభావం ఆధారంగా అవి గాలిలో కొంత సమయం ఉంటాయి.

7. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుంది. 8.భౌతిక దూరం 6 అడుగుల కన్నా ఎక్కువగా ఉంటే వైరస్ సంక్రమణ తక్కువ. ఈ పరిస్థితుల్లో ఇక మాస్కులు తప్పనిసరిగా దరించడం, ఆరు అడుగులు కన్నా నెక్కువ భౌతిక దూరం పాటించడం కీలకమని సిడిసి స్పష్టం చేసింది. వెంటిలేషన్ సరిపడా ఉండేలా చూడాలని సూచించింది. ఇండోర్ ఫ్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇవన్నీ పాటించడంతోపాటు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News