Saturday, October 5, 2024

నాకు స్వంత పిల్లలు లేరు, కానీ నేను పిల్లలు లేని దాన్ని కాను!!

- Advertisement -
- Advertisement -

మేడిసన్: అమెరికాలో డెమోక్రటిక్ ప్రెసిడెన్షయల్ నామినీ, అమెరికా వైస్-ప్రెసిడెంట్ అయిన కమలా హ్యారీస్  మేడిసన్ లో తన ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఆమె ప్రసంగిస్తూ ‘నాకు స్వంత పిల్లలు లేరు,కానీ నేను పిల్లలు లేని దాన్ని కాను’ (I’m Childfree, not childless) అన్నారు. ఆమె అన్నది సమానార్థ మాటలే అయినా అందులో స్వల్ప తేడా ఉంది. అంటే తాను బయోలజికల్ గా మాత్రమే పిల్లలు లేని దానిని అని ఆమె చెప్పకనే చెప్పారు.

ఆమెకు పిల్లలు లేకపోవడాన్ని ఆమె ప్రత్యర్థులు అస్త్రంగా వాడుకుంటున్నారు. వారి మాటల తూటాలకు కమలా హ్యారీస్ చక్కగానే జవాబిచ్చారు. పిల్లలు వద్దనుకునే వారిని ‘చైల్డ్ ఫ్రీ’ అంటారు, పిల్లలు కలగని వారిని ‘చైల్డ్ లెస్’ అని అమెరికాలో భావిస్తారు. ఆమె మాటల అంతరార్థం అదే. తన ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారీస్ తన స్వంత విషయాలకు కూడా సంజాయిషి ఇచ్చుకుంటూ ప్రచారం చేయాల్సి వస్తోంది. ఆమె విమర్శకులు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా వదలకుండా విమర్శిస్తుండడంతో ఆమె తనను తాను డిఫెండ్ చేసుకోడానికి అన్ని విషయాలు ప్రజల ముందు ఉంచాల్సి వస్తోంది. పర్సనల్ విషయాలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇంకా ఆమె చాలానే మాట్లాడారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News