- Advertisement -
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమైన సినిమా జూన్ లో విడుదల కానుంది. ఈ నెల 16న ఆడియో విడుదలకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని ఆడియో రిలీజ్ ను చిత్ర యూనిట్ క్యాన్సిల్ చేసింది. ఈ సందర్భంగా కమలహాసన్ మాట్లాడుతూ మాతృభూమి కోసం మన సైనికులు ఎంతగానో పోరాడుతున్న వేళ వేడుకలు చేసుకోవడానికి సమయం కాదని అన్నారు. దేశ సైనికులకు తమ మద్దతు తెలుపుతున్నామని దేశ పౌరులుగా ఇది మా బాధ్యత అని కమలహాసన్ అన్నారు. ఈవెంట్ కి సంబంధించి త్వరలోనే కొత్త డేట్ ను తెలియజేస్తామని కమలహాసన్ తెలిపారు.
- Advertisement -