Wednesday, June 4, 2025

‘కన్నప్ప’ టీమ్ కు బిగ్ షాక్.. హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు పరార్

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిలీం సర్కిల్ వివరాల ప్రకారం.. కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబయిలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపినట్లు సమాచారం. అయితే, ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని ఓ మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.

కొంతమంది తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో అన్ని ఇండస్ట్రీల స్టార్స్ నటించడంతో మూవీపై కొంత బజ్ అయితే ఉంది. ఈ క్రమంలో కీలక కంటెంట్ దొంగలించడంతో మేకర్స్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News