Friday, May 3, 2024

బెలగావి ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి ఊరట

- Advertisement -
- Advertisement -

బెలగావి ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి ఊరట
సెషన్స్ కోర్టు తీర్పు కొట్టివేసిన హైకోర్టు

బెంగళూరు: కర్నాటకలోని బెలగావిలో ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన తల్లి, ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడిని నిర్దోషిగా కర్నాటక హైకోర్టు తేల్చింది. ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ భట్‌ను దోషిగా తేల్చిన బెలగావి సెషన్స్ కోర్టు 2018 ఏప్రిల్‌లో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాగా.. ఈ తీర్పుపై ప్రవీణ్ భట్ అప్పీలు చేసుకోగా జస్టిస్ కెఎస్ ముదగల్, జస్టిస్ ఎంజిఎస్ కమల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ గురువారం తీర్పు వెలువరించింది. నిందితుడిపై ఆరోపణలు పూర్తిగా నిరూపితం కాలేదని పేర్కొంటూ సెషన్స్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. 2015 ఆగస్టు 16న బెలగావిలోని కువెంపు నగర్‌లోని ఇంట్లో గృహిణి రీనా మలగట్టి, ఆమె ఇద్దరు పిల్లలు ఆదిత్య, సాహిత్య హత్యకు గురయ్యారు. ఆమె సోదరుడు హేమంత్ దలాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు పక్కింట్లో నివసిస్తున్న ప్రవీణ్ భట్‌ను అరెస్టు చేశారు. రీనాతో తన అక్రమ సంబంధం దెబ్బతినడంతో భట్ ఆమెను గొంతుకోసి, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

Karnataka HC acquits accused in Triple Murder Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News