Sunday, May 5, 2024

కర్నాటక అసెంబ్లీలో 10 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అమర్యాదకరంగా వ్యవహరించిన 10 మంది బిజెపి ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నటు కర్నాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ బుధవారం ప్రకటించారు. బిజెపి ఎమ్మెల్యేలు సిఎన అశ్వథ్ నారాయణ్, వి సునీల్ కుమార్, ఆర్ అశోక, వేదవ్యాస్ కామత్, యశ్‌పాల్ సువర్ణ, ధీరజ్ మునిరాజు, ఉమానాథ్ కటియం, అరవింద్ బెల్లడ్, అరగ జ్ఞానేంద్ర, వై భరత్ షెట్టిలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీలో బుధవారం రభస జరిగింది.

బిజెపి ఎమ్మెల్యేలు బిల్లులకు చెందిన ప్రతులను చింపి వాటిని డిప్యుటీ స్పీకర్ రుద్రప్ప లమనిపై విసిరారు. ఉదయం సభ సమావేశమైన వెంటనే బిజెపి ఎమ్మెల్యేలు లేచి నిలబడి సోమవారం, మంగళవారం బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష నాయకుల సమావేశాలకు ప్రొటోకాల్ అధికారులుగా ఐఎఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడాన్ని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగమేనంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష బిజెపి సభ్యుల నిరసనల మధ్య హోం మత్రి పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్దరామయ్య వేర్వేరుగా ప్రకటనలు చేసేందుకు స్పీకర్ యుటి ఖాదర్ అనుమతించారు. ఐదు బిల్లులు కూడా ఆమోదం పొందేందుకు స్పీకర్ అనుమతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News