Wednesday, May 15, 2024

రవితేజ అంటే చాలా ఇష్టం

- Advertisement -
- Advertisement -

 

రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ కశిష్ ఖాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “నాకు ఇదే మొదటి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. కానీ రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. ఆయన దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. డైరెక్టర్ శ్రీనుకు ఏం కావాలో అది బాగా తెలుసు. ఆయనకు క్లియర్ విజన్ ఉంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, లవ్… ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు అన్ని రకాల పాత్రను పోషించాలని ఉంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News