Monday, September 25, 2023

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం

- Advertisement -
- Advertisement -

ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా?

మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు
కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు
మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్
ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ఆలోచన తెలంగాణ
మోడల్ దేశమంతా మారుమోగుతోంది ముఖరా(కె)
గ్రామం మన గౌరవం పెంచింది ఈ సీజన్ నుంచే పోడు
భూములకు రైతు బంధు ప్రతి నియోజకవర్గానికి 3వేల
చొప్పున గృహలక్ష్మి ఇళ్లు తలసరి ఆదాయంలో దేశంలోనే
తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది
ఎల్లపల్లి బహిరంగసభలో సిఎం కెసిఆర్
నిర్మల్ జిల్లాపై వరాల జల్లు ప్రతి పంచాయతీకి
రూ.10లక్షలు, మున్సిపాలిటీలకు రూ.25కోట్లు ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
నిర్మల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం

ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సిఎం

నిర్మల్ జిల్లా పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్, తొలుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా కొండాపూర్ వద్ద నిర్మించిన బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.

మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చె బుతున్నారని, మళ్లీ అవినీతికి తెరలేపడాని కి కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారి నే బంగాళాఖాతంలో వేయాలని పిలుపునిచ్చా రు. గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన అవినీతి ఉండేదని, ఎవరి భూమి ఎవరి పేరుతో ఉందో తెలిసేది కాదని పేర్కొన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహణీలు మారిపోయేవని అన్నారు. మళ్లీ పైరవీకారులు రావాలి…విఆర్‌ఒలు రావాలని, పట్వారీలు రావాలని, భూములు గోల్‌మాల్ చేసేందుకు దుర్మార్గం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కాం గ్రెస్ పార్టీ గతంలో పరిపాలించిన పార్టీయే అ ని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం…దళిత బంధుకు జై భీం అంటారని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన బిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం, రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కెసిఆర్ ప్రసంగించారు. రైతుబంధు ఏ విధం గావస్తుంది..హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాం కులో వేస్తే.. బ్యాంకు నుంచి రైతులకు మెస్సేజ్‌లు వస్తున్నాయని చెప్పారు. రైతు చనిపోతే ఏ విధంగా రైతుబీమా వస్తుంది… ఎవరూ మాట్లాడకుండా, దరఖాస్తు ఇవ్వకుండానే, ఆ ఫీసులకు వెళ్లకుండా ఎనిమిది రోజుల్లోనే రూ. 5 లక్షలు వారి ఇంటికి వస్తుందని వివరించా రు.

ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ప్రక్రియ సు లభతరమైందని చెప్పారు. ధరణి పోర్టల్ ఉం డటం వల్లనే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రి య పూర్తవుతుందని తెలిపారు. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అవుతుందని చెప్పారు. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా..? అని అడిగారు. ధరణి పోర్టల్ తొలగించాలా..? వద్దా…? అని ప్రజలు ఆలోచించాలని కోరారు. ధరణి తీసివేస్తే మళ్లీ ఎన్ని రోజులు  తిరగాలి..? ఎన్ని దరఖాస్తులు పెట్టాలి…? అని ప్రశ్నించారు.ధరణి ఉండాలా..? తీసివేయాలా..? అందరూ గట్టిగా చెప్పాలని సిఎం ప్రజలను అడిగారు. దీనికి జనం ధరణి ఉండాలంటూ నినదించారు.

గతంలో కాంగ్రెస్ పరిపాలన చూడలేదా..?

రాష్ట్రంలో ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసి.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరి ఊరిలో వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేలా 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కొన్న వడ్ల డబ్బులు బ్యాంకుల వేస్తే.. ఖాతాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో చాలా బాధలు ఉండేవని, రోజుల తరబడి పడావ్ పడేదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా..? అని ప్రశ్నించారు. ఇటీవల తాను మహారాష్ట్రకు వెళ్తే ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారని అడిగారని తెలిపారు. వడ్లు కొన్న డబ్బులు ఖాతాల్లో వేస్తారా..? రైతు చనిపోతే డబ్బులు బ్యాంకులోకి వస్తాయా…? రైతుబంధు సైతం బ్యాంకులకు వస్తదా…? అని ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పరిపాలన చూడలేదా..? అని ప్రశ్నించారు. గతంలో 50 ఏళ్లు పాలించిన పార్టీలు మనకు మంచి నీళ్లు ఇవ్వలేదని కెసిఆర్ విమర్శించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కింద 2 స్కీమ్‌లను త్వరలో పూర్తి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లందుతాయని తెలిపారు.

నిర్మల్‌కు జిల్లాకు నిధుల వరద

నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలు ప్రకటించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాల్టీలకు రూ.25 కోట్లు చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

త్వరలోనే బాసర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన

పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సిఎం పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా మంత్రి, ఎంఎల్‌లను ఈ సందర్భంగా సిఎం అభినందించారు. బాసర ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని వెల్లడించారు. త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని చెప్పారు. మారుమూల జిల్లా, అటవీ జిల్లా అని పేరున్న ఆదిలాబాద్‌లో ఇప్పుడు నాలుగు జిల్లాలు ఏర్పాటు అయ్యాయన్నారు. గతంలో జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే.. ప్రస్తుతం మరో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పేదల కోసం నిర్మించిన రెండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

తాలూకా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్

రాష్ట్రంలో తాలూకా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని సిఎం కెసిఆర్ తెలిపారు. దీని ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఎంత కరెంటు వాడుకున్నా అడిగేవారే లేరని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంత జాగాలో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.3 లక్షలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. యాదవ సోదరులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.

తెలంగాణ మోడల్ దేశమంతా మార్మోగుతోంది

తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. మహారాష్ట్ర ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణ మోడల్ కావాలని కోరుతున్నారని చెప్పారు. నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి సిఎ కెసిఆర్ ప్రసంగించారు. చక్కటి సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మింపజేసి తన చేతుల మీదుగా ప్రారంభించనిందుకు నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను సిఎం అభినందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కలిసి.. సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధించగలిగామని, అందులో అనుమానం అక్కర్లేదని అన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు చేరువైందని తెలిపారు. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయని, ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందని చెప్పారు. ఎపిలో ఉంటే 50 ఏండ్లకు కూడా ఈ కాలేజీ వచ్చేది కాదని పేర్కొన్నారు.

తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌లో ఉన్నాం

దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లాకు చెందిన ముఖరా(కె) గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని కెసిఆర్ గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా హ్యుమన్ ఇండెక్స్ డెవలప్‌మెంట్‌లో విద్యుత్ పర్ క్యాపిటా, పర్ క్యాపిటా ఆదాయలే మన గురించి తెలియజేస్తాయని అన్నారు. ఈ రెండింటి విషయంలో ఎక్కడో ఉన్న మనం చాలా పురోగమించామన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను దాటేసి వెళ్లిపోయామని చెప్పారు. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.. దీంతో పొంగిపోవద్దని, ఇంకా చాలా పేదరికం ఉందని తెలిపారు. దళిత జాతి, గిరిజన జాతి, వెనుకబడి తరగతుల్లో నిరుపేదలు ఉన్నారని, జరగాల్సింది చాలా ఉందని చెప్పారు. ఇదే పట్టుదల, కృషితో ముందుకు పోయి మన సోదరులుగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను సమాన స్థాయికి తీసుకుపోవాలని అన్నారు. గతంలో తాగు, కరెంట్, సాగునీటి సమస్యలు ఉండేవని, వీటన్నింటిని 9 ఏండ్లలో అధిగమించామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టే, భవిష్యత్ కోసం పురోగమించాలని అన్నారు. బాగా కష్టపడి పేదరికాన్ని తరిమేయాలని చెప్పారు. దేశానికే తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సీజన్ నుంచే పోడుకు రైతుబంధు

పోడు భూముల లబ్దిదారులకు పట్టాలు ఇస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని అన్నారు. ఈ సీజన్ నుంచే రైతుబంధు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు సేకరించాలని చెప్పారు. మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు.

నిర్మల్ కలెక్టర్‌ను సీట్లో కూర్చోబెట్టిన సిఎం

నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్,ఎంఎల్‌ఎలు జోగు రామన్న, బాల్క సుమన్, రేఖా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News