Friday, May 3, 2024

కెసిఆర్ ఓ ఫైటర్…ఛీటర్తో కలవరు

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎతో కలవడానికి మాకేమైనా పిచ్చికుక్క కరిచిందా?

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వ స్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా విజయవంతమవుతుందని అన్నారు. నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడారని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మోడీ మాట్లాడారని చె ప్పా రు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా ప్రధాన మంత్రిని కలిస్తే సంభాషణను రికార్డు చేసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. మంగళవారం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడీ, ఎన్‌డిఎ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సిఎం కెసిఆర్ ఓ ఫైటర్..ఛీటర్‌తో కలవరని మోడీని ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు. బిజెపి అంటే.. బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండి యా అని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించాలని కెసిఆర్..మోడీని కోరారని మోడీ చెప్పారని, తాను సిఎం కావడానికి మోడీ అనుమతి అక్కర్లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంఎల్‌ఎలు, తెలంగాణ ప్రజల అనుమతి ఉంటే చాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 105 అసెం బ్లీ స్థానాలలో బిజెపి పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని, ఈసారి 110 స్థానాలలో గల్లంతు కావడం ఖాయమని అన్నారు.బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్న అని, ఆ పార్టీకి వచ్చేస్థానాలు కూడా గుండు సున్నా అని ఎద్దేవా చేవారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కెటిఆర్ జోస్యం చెప్పారు. తాము చివరిదాకా నిలబడతాం ..బిజెపితో కొట్లాడుతా ం.. ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతామని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మోడీ..ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించారు
70 ఏళ్ల వయస్సులో మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారని కెటిఆర్ విమర్శించారు. రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు మోడీ వాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. ప్రధానమంత్రి అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పారు.
మోడీ తనకు అలవాటైన అబద్దాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని మోడీ చెప్పినవన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. విద్యార్హతల విషయంలోనే అబద్దం చెప్పిన ప్రధానమంత్రి మాటలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడడం దురదృష్టకరమని, ఇంతకంటే బాధాకరం, శోచనీయం ఇంకోటి లేదని వ్యాఖ్యానించారు.

కెసిఆర్ ఓ ఫైటర్…చీటర్‌తో కలవరు
కెసిఆర్ ఒక ఫైటర్…చీటర్‌తో కలవరని ప్రధాని మోడీ ఉ ద్దేశిస్తూ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్‌డిఎతో కలవడానికి మాకేమైనా పిచ్చికుక్క కరిచిం దా..? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చాయని, ప్రస్తుతం ఆ కూటమిలో సిబిఐ, ఇడి, ఐటి మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్‌డిఎ వీడిన పార్టీలపైకి ఇడి, సిబిఐని పంపుతున్నారని ఆరోపించారు. బిజెపితో దోస్తీ ఎలా ఉంటుందో టిడిపి, ఎస్‌ఎడి చూశాయని అన్నారు. బిజెపిలో చేరిన వారిపై ఉన్న కేసులు మరుగున పడుతున్నాయని మండిపడ్డారు. బిజెపిలో చేరే నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయని చెప్పారు.

ఎన్‌డిఎలో ఉంటే రాజులు యువరాజులు గుర్తుకురారు
కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి,మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా ఎవరు..? జైషా ఎవరు? అనురాగ్‌ఠాకూర్ ఎవరో చెప్పాలని కెటిఆర్ డి మాండ్ చేశారు. ప్రధానమంత్రి ఉంటే రాజులు యువరాజులు గుర్తుకురారని మండిపడ్డారు. జనతాదళ్ సెక్యూలర్ దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో పొత్తు పె ట్టుకున్నప్పుడు వారసత్వ రాజకీయాలు గర్తుకురాలేదా..? అని నిలదీశారు. జైషా ఎవరు? ఆయనకు బిసిసిఐ సెక్రటరీ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్‌డిఎలో చేరితే వా ళ్లకు నచ్చుతారు..లేదంటే రాచరికం అంటూ మాట్లాడతారని విమర్శించారు. హిమంత్ బిశ్వశర్మ, జ్యోతిరాదిత్య సిం థియాపై ఉన్న కేసులు ఏమయ్యాయని నిలదీశారు. ప్రకాశ్ బాదల్-, సుబ్బి సింగ్ బాదల్ వంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోలేదా..? అని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో ముఫ్తీ మహమ్మద్ సహిద్ కుమార్తెతో పొత్తు పెట్టుకోవచ్చు.. చంద్రబాబు నా యుడు, లోకేష్‌తో కలిసి పని చేయచ్చు, బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ థాక్రేతో కలిసి బిజెపి పొత్తు పెట్టుకోవచ్చు…అప్పుడు వారసత్వ రాజకీయాలు గుర్తుకురావని అని విమర్శించారు.

అబద్ధాలడడం ప్రధానికి అలవాటుగా మారింది
ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ అబద్దాలు ఆడడం ప్రధానమంత్రికి అలవాటు అయిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. బెంగాల్‌కు వెళ్తే మమతా బెనర్జీపైన, ఒరిస్సాకు వెళితే నవీన్ పట్నాయక్‌పైన, మేఘాలయ వెళితే సంగ్మాపైన అ బద్దాలు చెప్పారని, ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారని విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు కర్ణాటక కాం గ్రెస్ పార్టీ నుంచి డబ్బులు ఇచ్చిందని ప్రధాని చెబుతున్నారని, ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదని మండిపడ్డారు.

మోడీకి మీడియాను ఎదుర్కొనే ధైర్యం లేదు
ప్రధాని నరేంద్ర మోడీకి మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా లేదని మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రధాని చేసిన పసుపు బోర్డు ప్రకటన.. అదో పెద్ద జోక్ అని విమర్శించారు. హామీ ఇచ్చిన తొమ్మిదేళ్లకు ప్రకటన చేసి వెళ్లారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చి తొ మ్మిదేళ్లు అవుతుందని..తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ జరగాల్సి ఉందని, యుపి, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని, డీలిమిటేషన్‌పై భవిష్యత్తులో తమ పార్టీతో కలిసివచ్చే రాష్ట్రాలతో చర్చిస్తామని చెప్పారు.

ఎన్ని అబద్ధాలు చెప్పినా బిజెపిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు
రాహుల్ గాంధీ వచ్చి బిఆర్‌ఎస్ బిజెపికి టీం అంటారని, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నమని ప్రధానమంత్రి అంటారని కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌కు డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటి శాఖ, ఇతర శాఖలు నిద్రపోతున్నాయా..? అని ప్రశ్నించారు. తాము రెండుసార్లు ప్రజాస్వామికంగా ప్రజలల్లో గెలిచిన వ్యక్తులమని, తాము ఎవరికీ బీం కాదని చెప్పారు. గుండెలు చించుకొని అరిసినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవని కెటిఆర్ పేర్కొన్నారు. తాము ఢిల్లీ బానిసలం, గుజరాత్ బానిసలం కాదని అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, తెలంగాణ ప్రజలు మూడోసారి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానినికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా బిజెపిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో పొలిటికల్ టూరిస్టులైన బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు వివరించాలని అడిగారు.

ప్రధానమంత్రి నీతిమంతుడి అని మాట్లాడుతారని, మని అదానీ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకు వేయలేదని నిలదీశారు. ఈ విషయంలో ఎందుకు వెనక్కి వెళ్లారని ప్రశ్నించారు. శ్రీలంక ప్రధాన మంత్రితో 6 వేల కోట్ల అదాని కాంట్రాక్ట్ గురించి మాట్లాడిన ప్రధానమంత్రి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా ఎందుకు ఆగారని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News