Monday, May 13, 2024

తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

టీజర్‌లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వినోదాత్మక పాత్రలో కనిపించగా, తరుణ్ భాస్కర్‌ లోకల్ డాన్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. ఇక, ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో చైతన్య రావు మాదాడి, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజి సైన్మా మొదటి ప్రొడక్షన్ బ్యానర్ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News