Tuesday, December 10, 2024

వచ్చే నెలలోనే నా పెళ్లి: కీర్తి సురేష్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేశ్‌ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని కీర్తి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలింసదే. ఈ విషయాన్ని స్వయంగా కీర్తినే ప్రకటించారు. ఇప్పటికే ఆమె పెళ్లి పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఇదిలావుంటే.. శుక్రవారం కీర్తి సురేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తర్వాత ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కీర్తి.. తన పెళ్లి వచ్చే నెలలోనే ఉందని అందుకే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. గోవాలో తన వివాహ వేడుక జరుగనున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News