Thursday, May 2, 2024

మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

Khairatabad Ganesh Utsava Samiti honoring Hyderabad CP

హైదరాబాద్ సిపిని సన్మానించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి

హైదరాబాద్: నగర ప్రజలు వినాయకచవితికి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కోరారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవసమితితో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి మట్టి విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. వీరి విధంగానే భక్తులు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని వారికి మట్టి విగ్రహాల తయారీ గురించి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి నగర పోలీసులు అన్ని విధాల సహకరిస్తారని తెలిపారు. విగ్రహం వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూట్లను ఏర్పాటు చేశారని, వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద ఏర్పాటు చేసే విగ్రహాలకు ఏలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని తెలిపారు. వినాయకచవితికి రోడ్లను మరమ్మతు చేస్తామని, నీరు నిలిచేచోట చర్యలు తీసుకుంటామని, ఎల్‌ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 5లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మట్టి విగ్రహాల ఏర్పాటుపై విస్కృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, సెంట్రల్ జోన్ డిసిపి రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News