Monday, April 29, 2024

కుల, మత పిచ్చి ఎక్కువైంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Khammam Corporation is number One

ఖమ్మం: తెలంగాణలో నంబర్ వన్ కార్పొరేషన్ ఖమ్మం అని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. రఘునాథపాలెంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనంలో చెట్లను మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపినామా నాగేశ్వర్ రావు పరిశీలించారు. టేకులపల్లిలో 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కమ్యూనిటి హాల్, క్రీడా ప్రాంగణాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధి మిగతా కార్పొరేషన్లకు ఆదర్శం కావాలన్నారు.

ఖమ్మంలో లాకారం చెరువు అభివృద్ధి చాలు టిఆర్‌ఎన్ పనితీరుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించుకోవాలని, పచ్చగా ఉన్న దేశంలో లేనిపోని పంచాయతీలు పెడుతున్నారని, కులం, మతం పేరుతో మంటలు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మసీద్‌లు తవ్వాలంటున్నాడని, పరమతాలపై విషం నింపేవాడు రాజకీయ నాయకుడు ఎలా? అవుతాడని కెటిఆర్ ప్రశ్నించారు.

టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కుల పిచ్చి రేపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ.3,65,797 కోట్లు పన్నులు కట్టామని, కేంద్ర తెలంగాణకు తిరిగి ఇచ్చింది రూ.1,68,000 కోట్లు అని చెప్పారు. 1987లో చైనా, భారత్ ఆర్థిక పరిస్థితి సమానంగా ఉందని, దేశ పురోగతి లక్షంగా చైనా ముందుకెళ్తోందని, నేడు ప్రపంచంలోనే రెండువ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా మారిందన్నారు. మన దేశంలో మాత్రం కుల, మత పిచ్చి ఎక్కువైందన్నారు. కులం ఒక్కటే వస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడని, తెలంగాణ రాకముందు కరెంటు, నీళ్ల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలన్నారు. ఆనాడు కరెంట్ ఉంటే వార్త అని, ఈనాడు కరెంటు పోతే వార్త అని కెటిఆర్ అన్నారు. కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల పనితీరుకు, మన ప్రభుత్వానికి తేడా చూడాలన్నారు. 50 ఏళ్ల అధికారం ఇస్తే కాంగ్రెస్ ఏ సమస్యా పరిష్కరించలేదని, కొత్తగా ఆ పార్టీ చేసేదేం లేదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News