Tuesday, May 14, 2024

‘ఖిలాడి’ ఆటాపాట

- Advertisement -
- Advertisement -

Khiladi movie release on February 11 2022

 

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్‌లో సోమవారం నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు. ఇక మరొక పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు విశేష స్పందన లభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News