Thursday, May 2, 2024

అమరతేజానికి అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

Saiteja funeral over with military ceremonies

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్‌నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు
మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలోఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ అంత్యక్రియలు ఆదివారం నాడు పోలీసులు, సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సాయితేజ అంత్యక్రియాలకు బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. తీవ్ర విచార వదనాలతో సాయితేజకు వీడ్కోలు పలికారు. కాగా ఆదివారం ఉదయం జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. ఆంధ్రా-కర్నాటక సరిహద్దు నుంచి సాయితేజ పార్ధివదేహానికి నివాళి అర్పిస్తూ యువత బైక్ ర్యాలీ చేపట్టింది. ‘జై జవాన్ అమర్ రహే సాయితేజ’ అంటూ యువత నినాదాలతో మదనపల్లె ప్రాంతం మారుమ్రోగింది. అలాగే జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారత మాతాకు జై అంటూ దేశ భక్తిని చాటుకున్నారు.

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరులైన వీర జవాన్లకు దేశం కన్నీటి నివాళి అర్పించింది. భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా వీక్షించేందుకు వచ్చిన జనం సాయితేజ అమర్ రహే అంటూ నినదించారు. తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజ అమరుడైన విషయం విదితమే. గువరేగడిలో సైనిక లాంఛనాలతో లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తరలిస్తున్న క్రమంలో దారిపొడవునా ప్రజలు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో వలసపల్లి నుంచి ఎగువరేగడపల్లి వరకు సాయి తేజ అంతిమ యాత్ర కొనసాగింది. దారి పొడవునా సాయితేజలకు ప్రజలు ఘననివాళి అర్పించారు. భౌతిక కాయం చేడగానే సాయితేజ భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపించారు. స్తున్నారు.

రూ.50 లక్షల పరిహారం

లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేశారు. మైదానం చుట్టు ప్రత్యేక బారికెడ్లను ఏర్పాటు చేశారు. వీరజవాను సాయితేజ కుటుంబానికి ఎపి ప్రభుత్వం అండగా నిలిచిన రాష్ట్రప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆర్మీ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, మరో 13 మందితో కలిసి లాన్స్ నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News