Saturday, August 9, 2025

గ్రామ స్థాయి నుంచే స్వదేశీ ఉద్యమం రావాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గ్రామ స్థాయి నుంచే స్వదేశీ ఉద్యమం రావాలని బిజెపి నాయకుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్వర్యంలో పలువురు మహిళలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డికి రాఖీలు కట్టారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింతగా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రజలు సాధ్యమైనంత ఎక్కువగా మన దేశీయ ఉత్పత్తులను వినియోగించాలని ఆయన కోరారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా మహిళలు పెద్ద ఎత్తున రాఖీ పౌర్ణమి జరుపుకున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News