Thursday, May 2, 2024

సత్యాగ్రహ దీక్షకు దిగిన కోదండ‌రాం

- Advertisement -
- Advertisement -

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపున‌కు నిరసన
ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తేనే ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని వ్యాఖ్య‌
ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆగ్ర‌హం

Kodandaram strike against Petrol diesel hike

హైదరాబాద్:  దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం దీక్ష‌కు దిగారు. హైదరాబాద్ లో టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తేనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయని తెలిపారు. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయని చెబుతూ, ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమర్శించారు. ప్రభుత్వాలు చెబుతున్న అస‌త్యాల‌ను నమ్మడానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేరని చురకలంటించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేకపోతే రాజీనామా చేయాలని మంత్రుల‌ను కోదండరాం డిమాండ్ చేశారు. తాము ప్ర‌తి గ్రామానికి వెళ్లి ప్రజలకు ధరల పెరుగుదలపై వాస్తవాలు వివరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News