- Advertisement -
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ మూవీ. యంగ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ హీరో జోనర్ లో తెరకెక్కిన ఈ మలయాళి సినిమా.. స్టార్ హీరోల రికార్డు కలెక్షన్లను దాటేసింది. దీంతో కల్యాణి ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘కొత్త లోక’ నిలిచింది. అంతకుముందు స్టార్ హీరో మోహన్ లాలు మూవీ ఎల్2:ఎంపురాన్ రూ.265.5 కోట్ల వసూళ్ల సాధించి తొలి స్థానంలో ఉన్నది. ఇప్పుడు ఆ రికార్డును ‘కొత్త లోక‘ మూవీ బద్దలు కొట్టింది. కేవలం రూ.30 కోట్లతో రూపొందించిన ఈ సినిమా.. 24 రోజుల్లో రూ.267కోట్లు వసూలు చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీని హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.
- Advertisement -