Thursday, May 2, 2024

రోజుల వ్యవధిలోనే నేపాల్ ప్రధానిగా తిరిగి ఓలీ

- Advertisement -
- Advertisement -

KP Sharma Oli sworn in as Prime Minister of Nepal

ఖాట్మాండూ: నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఓలీ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో కీలక విశ్వాస పరీక్షలో ఓటమి పాలయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఓలీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం కీలక పరిణామం అయింది. తన మునుపటి కేబినెట్‌ను ఓలి యధాతథంగా ఉంచారు. స్థానిక అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో శర్మతో దేశాధ్యక్షులు బిద్యా దేవి భండారి ప్రమాణం చేయించారు. నేపాల్ ప్రతినిధుల సభలో అతి పెద్ద రాజకీయ పార్టీ నేత హోదాలో ఉన్నందున ప్రధానిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. గురువారం ఆయన నియామక ప్రకటన వెలువడింది. సోమవారం పార్లమెంట్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో సిపిఎన్ యుఎంఎల్ ఛైర్మన్ అయిన ఓలీ తమ బలం నిరూపించుకోలేకపొయ్యారు. అయితే రెండు మూడు రోజుల వ్యవధిలో ప్రతిపక్షం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన బలాన్ని సంతరించుకోలేకపోయింది. దీనితో తిరిగి శర్మ ఆధిపత్యానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News