గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ రూమర్ వైరల్ అవుతోంది.
సుకుమార్, రామ్‌చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ నెలకొంది. అయితే ఈ సినిమాలో ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన సీతగా నటించిన కృతిసనన్‌ని హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్.
కృతి తెలుగులో ‘1-నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘దోచెయ్’ అనే మరో సినిమా చేసింది. ఇది ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో కృతి పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు సుకుమార్, రామ్‌చరణ్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు గత రెండు, మూడేళ్లలో మాత్రం కృతి చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఈ ప్రాజెక్టుతో అయినా.. కృతికి బ్రేక్ వస్తుందో. లేదో చూడాలి.స
Also Read : ఎవరినీ తొలగించలేదు