Thursday, February 9, 2023

ముందుంది సినిమా

- Advertisement -

సెస్ ఎన్నికల్లో ప్రజాతీర్పు రాష్ట్రానికే
మార్గనిర్దేశం బిజెపి నేతలు డబ్బులు
పంచినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు
వచ్చే ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర
రెండు బిజెపి పాలిత రాష్ట్రాల మధ్య
పంచాయితీని పరిష్కరించలేని మోడీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరా?
మోడీ ఎవరికి దేవుడు? గుజరాత్
నాయకుల చెప్పులు మోయడానికి తప్ప..
రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకూ పనికిరారు
సిరిసిల్ల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో
మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్

జీవితం పరిమితం.. అందులోనూ అధికారం మరింత పరిమితం.. అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా మంచి పనిచేయాలి..
-సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల: మొన్నటి సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో చూపింది కేవలం ట్రైలర్ మాత్రమే.. బిజెపికి అసలు సినిమా 2023లో చూపిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తా రక రామారావు వ్యంగ్యంగా విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ఈసారి గులాబీ జండా ఖాయంగా ఎగురవేయాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం జిల్లా కేం ద్రం సిరిసిల్లలో జరిగిన సెస్ పాలకవర్గ డైరెక్టర్ల కృతజ్ఞ త సభలో కెటిఆర్ మాట్లాడుతూ..  బిజెపి నేతలు చేసే దుష్ప్రచారాలను బిఆర్‌ఎస్ నాయకులు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

సిఎం కెసిఆర్ చేసే అప్పులన్నీ పెట్టుబడి కోసం కాగా, ప్రధాని మోడీ చేసిన అప్పులన్నీ ఆయన కార్పొరేట్ స్నేహితులైన ఆదానీ, అంబానీల కోసమని మంత్రి విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు పనిచేసిన 14మంది ప్రధానమంత్రులు కలిపి రూ.56లక్షల కోట్లు అప్పులు చేస్తే.. 8ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ములను ఏం చేశారో చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. మోడీ గుజరాత్ దోస్తులు ఆదానీ, అంబానీలకు రూ.12లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసింది నిజం కాదా అన్నది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారటూ..

బిజెపి నేతలు బద్‌నామ్ చేస్తున్నారని సిఎం కెసిఆర్ అప్పులు తెచ్చింది పెట్టుబడి కోసమన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మలకపేట వంటి ప్రాజెక్టులు నిర్మించారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ, ఇంటింటికి తాగునీరు సరఫరా వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మోడీ చేసిన అప్పులతో చేసిన అభివృధ్ధి ఏమిటో చెప్పాలన్నారు. లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయపరిస్తే దేశమంతా ఉచిత కరెంట్ ఇవ్వవచ్చని కెటిఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు మోడీ ఉచిత కరెంట్ ఇచ్చారా, రుణ మాఫీ చేశారా అని నిలదీశారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ తలపైన రూ.లక్షా ఇరవై అయిదు వేల అప్పు ఉందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో వందల గ్రామాల వారు రెండు నెలలుగా సరిహద్దు వివాదంతో పరస్పరం కొట్టుకుంటుంటే.. రెండుచోట్ల బిజెపి పాలిత ప్రభుత్వాలు ఉన్నా ఆపలేక పోయిన మోడీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపగలరని నిలదీశారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి రాష్ట్రాలు మాత్రం ధరలు పెంచవద్దని హితవు పలుకుతారని ఇదెలా సాధ్యమన్నారు.

రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ లాంటి దివాళాకోరు నాయకుడు మోడీ దేవుడని ప్రస్తుతిస్తారని, మోడీ ఎవరికి దేవుడని, గుజరాతీలకా, నీకా, మాకా అని నిలదీశారు. రూ.400 ఉండే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 చేసినందుకు మహిళలకు దేవుడా, 70 రూపాయల పెట్రోలు రూ.110 చేసినందుకు మగవారికా, 13నెలల ఆందోళనలో 700 మంది రైతులను చంపినందుకు రైతులకు దేవుడా, ఎస్‌టి తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, ఆరు శాతమున్న ఎస్‌టి రిజర్వేషన్లు పది శాతానికి పెంచిన బిల్లు ఆమోదించమని కేంద్రానికి పంపితే తొక్కిపెట్టినందుకు ఎస్‌టిలకు దేవుడా అని ప్రశ్నించారు. దేశంలో 14మంది ప్రధానమంత్రులు చేయని విధంగా చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టి విధించినందుకు మోడీ నేతన్నలకు దేవుడా అని నిలదీశారు. రాష్ట్రంలో బిజెపిని నడిపే మూర్ఖుడు సంజయ్ మాత్రం తెలంగాణలో ఎన్నడూలేనివిధంగా 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే యువతను బిజెపికి దూరం చేశావంటున్నాడని, ప్రాజెక్టులు నిర్మించి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇస్తే రైతులను దూరం చేశామంటున్నాడ ని, 46 లక్షల మంది వృద్ధులకు ఆసరా పెన్షన్లు ఇస్తే ము సళోల్లను బిజెపికి దూరం చేశావంటున్నాడన్నారు. ఇది లా ఉంటే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం కరోనా వాక్సిన్‌ను మోడీ కనిపెట్టారంటారన్నారు. కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా బిజెపి నేతలు రాష్ట్రంలో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles