Thursday, May 2, 2024

గుజరాత్‌కు రూ.20 వేల కోట్లు.. తెలంగాణకు రూ.500 కోట్లా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోడీ అని విమర్శించారు. విభజన హామీలు కూడా నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.500 కోట్లు నిధులు ఇవ్వడం ఏంటని కెటిఆర్ అడిగారు. తెలంగాణ పట్ల మోడీ మొసలికన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read: ప్రాణం తీసిన మేక కన్ను

గాంధీభవన్‌లో గాడ్సే దూరిండని మండిపడ్డారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఏనాడైనా మోడీని పల్లెత్తు మాట కూడా అనలేదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని, పతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలు కలిసి పని చేశాయని, ఆ రెండు పార్టీల మోసాలు ప్రజలకు తెలుసునన్నారు. సిఎం కెసిఆర్ పోరాటాన్ని గుర్తించి ఇతర రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. తెలంగాణలో మూడోసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ హోదా ఏంటని? కెటిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News