- Advertisement -
హైదరాబాద్: తమకు మైక్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వట్లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కత్తి వాళ్ల చేతిలో పెట్టారని మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండ, సూర్యాపేట ఆర్ఆర్ఆర్ బాధితులు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. మీ సమస్య పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరించండని కోరారు. మీరు స్థానిక ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య ఢిల్లీకి వెళ్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్ మెంట్ మార్చడం కొత్తేంకాదని కెటిఆర్ విమర్శించారు.
Also Read : కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు: రంగనాథ్
- Advertisement -