Tuesday, April 30, 2024

మరోసారి మానవత్వం చాటుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR financial assistance to family of Aishwarya

 

ఆత్మహత్య చేసుకున్న ఐశ్వర్య కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన మంత్రి
ప్రభుత్వ పక్షాన షాద్‌నగర్‌లో ఉచిత డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ
కృతజ్ఞతలు తెలిపిన ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఎఎస్ కోచింగ్‌కు ప్రిపేర్ అవుతూ లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్‌డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్‌లైన్ క్లాసులు హాజరయ్యేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కొనుగోలు చేయలేని ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు ఎంచుకున్న తన లక్ష్యం, మరోవైపు పేదరికంతో తన ఉన్నత చదువు ఎక్కడ దూరమవుతుందమొనన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నది. పేదరికంతో ఐశ్వర్య కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాజాగా కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

కూతురు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనలో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు కెటిఆర్ ముందుకు వచ్చారు. గురువారం వారిని ప్రగతి భవన్‌కి పిలిపించి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్ షాద్ నగర్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరఫున అందించేందుకు హామీ ఇచ్చారు. అత్యంత పేదరికాన్ని జయించి దేశంలోనే ప్రముఖ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్న కెటిఆర్ ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామి ఇచ్చారు. కాగా మంత్రి కెటిఆర్ చూపిన ఉదారత పట్ల ఐశ్వర్య రెడ్డి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కూతురుని కోల్పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేని తమ కుటుంబానికి మంత్రి చేసిన సహాయం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న మంత్రి కెటిఆర్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఉద్వేగానికి లోనవుతూ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News