Sunday, May 5, 2024

మేడ్ ఇన్ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ప్రగతిశీల వైద్య పరికరాల పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి హువెల్ లైఫ్ సైన్సెస్, ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్, బ్లూసెమీ ద్వారా ’మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని మెడ్-టెక్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి పరీక్షలను బలోపేతం చేసేందుకు పలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రొడక్ట్ టెస్టింగ్ కోసం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం, తమ ద్వారా ప్రపంచ స్థాయి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ డివైజ్‌లను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో మెడ్-టెక్ రంగంలో మరో మైలురాయిని చూసినందుకు తాను సంతోషిస్తున్నానన్నారు.

‘ఇది నాకు చాలా గర్వంగా ఉంది. వీటిలో చాలా ఉత్పత్తులు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా మిగిలినవి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ వినూత్న ఉత్పత్తులను ప్రారంభించడం రాష్ట్రంలోని శక్తివంతమైన మెడ్‌టెక్ పర్యావరణ వ్యవస్థకు నిదర్శనం’గా పేర్కొన్నారు. భారతదేశంలో దేశీయంగా తయారు చేయబడిన కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ కిట్‌ల యొక్క అతి పెద్ద సరఫరాదారు హ్యూవెల్ లైఫ్‌సైన్సెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపకుడు డాక్టర్ శశీర్ కుమార్ మాట్లాడుతూ, తాము తెలంగాణ నుండి ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ కూడా ప్రపంచానికి వ్యాక్సిన్‌ల వంటి వైద్య పరికరాల హబ్‌గా మారుతుందని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు.

టిబిని గుర్తించడానికి చవకైన డయాగ్నస్టిక్ కిట్‌ను అభివృద్ధి చేసిన ఇఎంపిఇ డయాగ్నోస్టిక్స్ సిఇఒ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తమ ప్రస్తుత సామర్థ్యం 25 మిలియన్ కిట్‌లు, త్వరలో 100 మిలియన్ కిట్‌లకు విస్తరిస్తామన్నారు. తెలంగాణలో కిట్‌లను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించడమే తమ లక్షమని పేర్కొన్నారు. బ్లూ సెమీ సిఇఒ, వ్యవస్థాపకుడు సునీల్ మద్దికట్ల మాట్లాడుతూ, ఇవైవిఎ గాడ్జెట్ వంటి అద్భుతమైన ఆరోగ్య సాంకేతిక ఆవిష్కరణల పురోగతిగా అభివర్ణించారు.
హ్యూవెల్ లైఫ్ సైన్సెస్…
హ్యూవెల్ లైఫ్‌సైన్సెస్ అనేది సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైసెస్ పార్క్‌లో సదుపాయాన్ని కలిగి ఉన్న ఇన్విట్రో డయాగ్నోస్టిక్స్, రియాజెంట్. ఇది హీమోమెజర్, ఫెర్రీక్వాంట్, హీమోగ్లోబిన్ టెస్టింగ్ పరికరం, సెమీక్వాంటిటేటివ్ ఎల్‌ఎఫ్‌ఎ కాకుండా వివిధ ఇన్‌ఫెక్షన్‌ల న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష కోసం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News