Friday, September 13, 2024

రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా సిఎం మాట్లాడవద్దని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తిమంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం మానేయాలని కెటిఆర్ ఎక్స్ వేదికగా సిఎంకు హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి ప్రకటనలు సిఎం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాల వల్ల తెలంగాణకు నష్టం జరగకూడదని కెటిఆర్ ఆకాంక్షించారు. తమ హయాంలో పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమర్ రాజాను ఒప్పించేందుకు గతంలో చాలా కష్టపడ్డామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులందరికీ సముచిత గౌరవం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా ఉండాలని వివరించారు. గతంలో కేన్స్ టెక్నాలజీ రాష్ట్రం నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని, ఇప్పుడు కార్నింగ్ ప్లాంట్, అమర్ రాజా కంపెనీలు చెన్నైకి వెళ్లిపోతే అది విపత్తు అని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటం ఎంతమాత్రం మంచిది కాదని, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలని, లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News