Tuesday, April 30, 2024

బెంగళూరు కంటే ఎక్కువ ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెంగళూరు కుంటే తెలంగాణలో అధికంగా ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నగరంలోని మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు సోమవారం ఉదయం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. “పాతబస్తీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూసీ ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తాం. ధ్యానం ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాను అధిగమించాం. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారింది. ముఖ్యమంత్రి  కెసిఆర్ నాయకత్వంలో కాళేశ్వరం పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. బెంగళూరు కుంటే అధికంగా ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవి. సిఎం కెసిఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. బిఆర్ఎస్ స్టీరింగ్ సిఎం కెసిఆర్ చేతిలో, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది.. బిజెపి స్టీరింగ్ ప్రధాని చేతిలో కాకుండా అదానీ చేతిలో ఉంది” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News