Wednesday, May 8, 2024

సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వర ద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మూడో రో జు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులు, ప్ర జాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్‌లో మా ట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని సిఎం అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.

వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాల ని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ ముంపుకు గురైన ప్రాంతాల్లో హెలికాప్టర్లు ద్వారా ఆహారం, తాగునీరు. మందులను అందించేలా సిఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అధికారులతో కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్
గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గుముఖం పట్టాయి, ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల కొనసాగించాలని సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు మంత్రులకుఆదేశాలు జారీ చేశారు. సిఎం ఆదేశాల మేరకు మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి పరిధిలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ముంపు కాలనీలు, మూసీ పరివాహక ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పారిశుద్ధ్య నిర్వహణ,

సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముంపునకు గురైన వైద్య సేవలపై ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సిఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిగమ్నమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్న మంత్రి హరీష్ రావు, ఆస్పత్రుల్లో, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందులు సరఫరా పరిస్థితిని సిఎంకు ఫోన్‌లో వివరించారు.
భద్రాచలం ప్రాంతంలో పువ్వాడ ఏరియల్ సర్వే
ఎగువన గోదావరి ప్రాంతంలో వదర ఉదృతి కొనసాగుతుండటంతో భద్రాచంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. సిఎం ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి జరిగిన నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఫోన్‌లో ఆదేశించారు. సిఎం ఆదేశాలతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
చీఫ్ ఇంజనీర్లకు ఫోన్ ద్వారా సిఎం ఆదేశాలు
ఎగువ నుంచి గోదావరికి వరద పెరగడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఇన్ ఫ్లోను ముందస్తు అంచనా వేసి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సిఎం కెసిఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News