Saturday, September 21, 2024

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోమల్ పరిహార్, ప్రతాప్‌సింగ్ పరిహార్ అనే వ్యక్తులు తన కుటుంబ సభ్యులతో కలిసి గుంతకల్లులో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు పానీపూరి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కోమల్ తనయుడు కుల్‌దీప్(24), ప్రతాప్‌సింగ్ కూతురు మీనూ(21) ఇద్దరు మధ్య పరిచయం ఉండడంతో ప్రేమించుకున్నారు.

కులదీప్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కులదీప్ తల్లిదండ్రులు ప్రేమపెళ్లిని వ్యతిరేకించారు. ప్రేమ జంట బైక్‌పై మద్దికెరకు చేరుకున్నారు. మద్దికెర రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మీనూ చేతిలో సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మృతికి ఎవరూ కారకులు కాదని హిందీలో వారు రాసినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను మద్దికెర పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. మీనూ కనిపించడంలేదని మంగళవారం కసాపురం పోలీసులకు ప్రతాప్ సింగ్ ఫిర్యాదు చేశాడు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News