కుషాయిగూడ: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడ ప్రాంతం కాప్రాలో అర్ధ రాత్రి కత్తితో భార్యను నరికి భర్త పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన బోడ శంకర్(40), భార్య పేరు మంజుల(35) అనే దంపతులు కాప్రాలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాప. ఇద్దరు బాబులు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న అక్క బావ ఇంటికి కుటుంబంతో కలిసి శంకర్ వచ్చాడు. అర్థరాత్రి అందరు పడుకున్న తరువాత కత్తితో భార్యను విచక్షణారహితంగా నరికాడు. ఆమె అరుపుల శబ్ధానికి అందరు లేవడంతో అక్కడి నుంచి శంకర్ పారిపోయాడు. మంజుల ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మావోయిస్టు పార్టీలో ముసలం!