Tuesday, May 7, 2024

లబుషేన్‌కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

Labuschagne ranks top in Test batting ICC rankings

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ రెండో టెస్టులో లబుషేన్ ఒక సెంచరీ, మరో అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో అతను 912 రేటింగ్ పాయింట్లతో కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 897 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడి పోయాడు. ఇంతకుముందు రూట్ అగ్రస్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. కాగా, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో కమిన్స్, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News