Tuesday, April 30, 2024

రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూకు బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైల్వేలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

తమపై జారీ అయిన సమన్లకు స్పందిస్తూ బుధవారం వీరు ముగ్గురూ కోర్టులో హాజరుకాగా ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్ వారికి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సెప్టెంబర్ 22న వారికి సమన్లు జారీచేసింది.2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్నకాలంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెస్ట్ సెంట్రల్ జోన్‌లో జరిగిన గ్రూపు డి నియామకాలకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగినట్లు అభియోగాలు వచ్చాయి.

ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబీకులకు బదిలీ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. 2022 మే 18న సిబిఐ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలతోసహా పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News