Wednesday, May 8, 2024

కలుషీత జలాలను త్వరితంగా నిర్ధారించేందుకు సరికొత్త టెక్నాలజీ

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : పైప్‌లైన్‌లో కలుషీత జలాలను తక్కువ వ్యవధిలో గుర్తించేందుకు, ఈ సమస్యను త్వరితంగా అధిగమిచ్చేందుకు జలమండలి కొత్త ఆధునిక టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మన యువ ఇంజినీర్ల స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తమ మేధాస్సుకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఈ యంత్రం ప్రజలకు బహుళ ప్రయోజనలకు ఉపకరిస్తోంది. యంత్ర పరికరం పేరు ఖ్విక్ ఐడెంటిఫికేషన్ వాటర్ పొల్యూషన్ సోర్స్ (ఖివ్‌ప్స్) కొత్త యంత్రం ద్వారా నీటి పైప్‌లైన్‌లో కలుషీత జలాలను త్వరితంగా నిర్ధారించవచ్చు…ప్రస్తుతం డివిజన్ 3లో పీఎస్ నగర్ జలమండలి సెక్షన్ పరిధిలో విజయనగర్ కాలనీలో తాగు నీటిలో కలుషీత జలాలను తక్కువ వ్యవధిలో గుర్తించేందుకు తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఈ యంత్రాన్ని జలమండలి పరిధిలో అన్ని డివిజన్లలో ఉపయోగించనున్నారు.

వివిధ బస్తీలు,కాలనీలు ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్‌లైన్, మంచి నీటి లైన్లు పక్కపక్కనే ఉంటున్నాయి. తరుచూ రోడ్ల ధ్వంసం చేస్తుండటం, తరుచూ పైపులు పగిలిపోయి వీదుల్లో మురికిప్రవాహంతో జనం ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పలు బస్తీల్లో తాగు నీటి నల్లాలో డ్రైనేజీ మురికి కలవడం, ఆ నీరు కలుషీతం కావడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలను ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల ఫిర్యాదుల మేరకు జలమండలి వర్గాలు ఈ ఆధునాతన మిషిన్‌ను ఉపయోగిస్తారు. యంత్రం సహయంతో తొలుత పగిలిన పైప్‌లైన్‌లోకి యంత్రానికి ముందువైపు చిన్న కెమెరాను అమర్చారు. కెమెరా అనుకుని యంత్రానికికున్న పైపులు లోపలకి పంపిస్తారు.

కలుషీత జలాలు ఎక్కడున్నాయో త్వరితంగా పోటోలు తీస్తుంది. తర్వాత కెమెరాను కంప్యూటర్ సెటప్ బాక్స్ ద్వారా నిర్ధారించుకోవచ్చని పీఎస్ నగర్ జలమండలి సెక్షన్ మేనేజర్ రాంబాబు పేర్కొన్నారు. నూతన ఆధునిక టెక్నాలజీని తమ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యంత్ర పరికరంతో రోడ్ల తవ్వకాలు తక్కువగా ఉంటుందని, మనుషుల శ్రమ తగ్గుతుందని, త్వరితంగా పైప్‌లైన్‌లో సరఫర అవుతున్న కలుషీత జలాలను త్వరితంగా నిర్ధారించవచ్చని, తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడేవిలుంటుదని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News