Friday, May 3, 2024

జులై 21, 22 తేదీలలో లాసెట్

- Advertisement -
- Advertisement -

LAW CET on 21st and 22nd July

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు గురు, శుక్రవారాలలో(జులై 21,22 తేదీలలో) లాసెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు లాసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ జి.బి.రెడ్డి తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బికి పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ 22న ఉదయం పిజిఎల్‌సెట్, మధ్యాహ్నం సెషన్‌లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో పొందుపరిచినట్లు లాసెట్ కన్వీనర్ జి.బి.రెడ్డి తెలిపారు. లాసెట్ నిర్వహణ కోసం మొత్తం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

న్యాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌తో ఏటా లాసెట్‌కు దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నాయి.ఈసారి లాసెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. లాసెట్‌కు మొత్తం 35,538 దరఖాస్తులు వచ్చాయి. అందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బికి 24,938 మంది దరఖాస్తు చేసుకోగా, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బికి 7,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు 3,093 మంది దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News