Wednesday, May 8, 2024

అన్ని రాష్ట్రాల అనుమతితోనే నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman clarifies on GST rates

నిత్యావసరాలపై 5% జిఎస్‌టిపై ఆర్థికమంత్రి నిర్మల స్పష్టత

న్యూఢిల్లీ : రోజువారీగా వినియోగించే నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి విధించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పదించారు. బిజెపి యేతర రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాల అనుమతి తర్వాతే గోదుమ పిండి, ఇతర వస్తువులపై 5 శాతం జిఎస్‌టి నిర్ణయం తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ప్యాక్ చేసిన పిండి, పెరుగు, పనీర్, లస్సీ, తేనె, డ్రై మఖానా, డ్రై సోయాబీన్, బఠానీలు, గోధుమలు, ఇతర తృణధాన్యాలు, పఫ్డ్ రైస్‌పై ఐదు శాతం జిఎస్‌టి విధించాలని నిర్ణయంతో ఈ వస్తువుల ధరలు పెరిగాయి. ఈ నిర్ణయం వల్ల మోడీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం రోటీ, పప్పులపై కూడా పన్ను వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధింపును బిజెపియేతర పాలిత రాష్ట్రాలైన పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఆర్థిక మంత్రి 14 ట్వీట్ల ద్వారా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News