Thursday, May 2, 2024

ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -

Let’s block the Prime Minister’s visit:Tribal student unions

నల్లజెండాలు ఎగురేస్తాం
గిరిజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని గిరిజన, ఆదివాసి విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు మంగళవారం గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బునాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కె.శరత్‌నాయక్, లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి. అశోక్‌నాయక్, ఆదివాసి స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు పాపారావు, ఆల్ ఇండియా బంజారా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి పవన్‌నాయక్, గిరిజన విద్యార్థి సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా సిఎం కెసిఆర్ శాసనసభలో ఐదు సంవత్సరాల క్రితమే రిజర్వేషన్ పెంపుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది.

కేంద్రం దానిని బుట్టదాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో 50% రిజర్వేషన్లు మించకూడదని నిలువరించజాలదని ఒకవేళ ఏ రాష్ట్రానికైన కేంద్రానికైన ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినపుడు రాష్ట్రం చేసుకునే వీలుందన్నారు. పలుమార్లు ఈ అంశంపై ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. అయినా కేంద్రప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదు. ఇందుకు నిరసనగా ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని గిరిజన నివాస ప్రాంతాలలో, తండాలలో, చెంచు పెంటలలో రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగరవేసి మా నిరసన తెలియజేస్తాం, ఇప్పటికైనా ప్రధానమంత్రి మోది కళ్లు తెరిచి వెంటనే మా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News