Thursday, May 2, 2024

స్వచ్ఛతకై సాగుదాం…. పచ్చదనం కై ప్రతిన పూనుదాం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : స్వచ్ఛతకై సాగుదాం.. పచ్చదనం కై ప్రతిన పూనుదామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త వేయడం ఆరోగ్య రక్షణ మొక్క నాటడం పర్యావరణ పరి రక్షణ అన్నారు. ఆకు పచ్చ సిద్దిపేటకు అడుగులు వేద్దాం ఆరోగ్య శుద్దిపేటగా మార్చుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చెట్టు బోటుగా పేరు పెట్టామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకంతో ఎంతో అవసరం ఉందన్నారు. తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనదన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రులు కట్టడం కాదు.. వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరమన్నారు. ప్రజలకు స్వచ్చమైన గాలి అందించి ఊపిరితిత్తులను కాపాడాలన్నారు. చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృద్ధ్ది జరుగుతుందన్నారు. మిషన్ భగిరథ ద్వారా స్వచ్చ గోదావరి తాగునీరు అందిస్తున్నామన్నారు. హరితహారంలో ,వ్యవసాయంలో , రసాయనాలు తగ్గించి స్వచ్చమైన గోదావరి నీళ్లతో పండించిన పంట అందించాలని తెలిపారు.
హరిత హారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ప్రతిరోజు ఉదయం వార్డులో చెత్త వేరడం ఒక మంచి పరిణామన్నారు. కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన చైతన్యం కలుగుతుందన్నారు. మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారని అన్నారు. జాతీయ స్ధాయిలో సిటిజన్‌ఫిడ్ బ్యాక్ లో మనం రెండో స్ధానంలో ఉన్నామని తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, , సిబ్బంది మీరంతా కల్సి కష్టపడితే మొదటి స్ధానంలో ఉంటామన్నారు. మొక్కలు పంచడమే కాదు నాటి పెంచే విధంగా కౌన్సిల్లు సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News