Wednesday, May 8, 2024

భావి తరాలకు స్వచ్ఛమైన గాలి అందిద్దాం

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి జిల్లా హరిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ 2023/24 సంవత్సరానికి హరితహారం లక్షాల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు ఎన్‌హెచ్‌ఎఐ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టార్గెట్ మేరకు మొక్కలు నాటాలని, విద్యాశాఖకు అదనంగా లక్షాన్ని కేటాయించాలని డిఆర్‌ఓకు సూచించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ గురుకుల పాఠశాలల్లో వెయ్యి మొక్కల చొప్పున నాటాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత సంక్షేమ అధికారులు ఆర్‌సిఓలకు చెప్పారు. ప్రభుత్వ భవనాలు ఉన్న అన్ని శాఖలు వందశాతం మొక్కలు పెట్టాలని ఆదేశించారు.

మున్సిపాలిటీల పరిధిలోని అన్ని పబ్లిక్ ఇన్సిట్యూషన్స్, స్థలాల్లో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్‌లకు లే అవుట్‌లు ఉన్న అన్ని చోట మొక్కలు పెట్టించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లోని రోడ్లకు ఇరువైపులా మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో సమన్వయంతో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ శ్రీనివాస్‌రావు, ఎన్‌హెచ్‌ఎఐపిడి రాజేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News