Monday, May 13, 2024

ఎల్‌ఈడి బల్బులనే వాడదాం, విద్యుత్తును పొదుపు చేద్దాం

- Advertisement -
- Advertisement -

మధిర : విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతున్న ఈరోజుల్లో ఎల్ ఈ డి బల్బుల వాడకం ద్వారా కరెంటు పొదుపు చేయవచ్చు అని జిల్లా డిస్ట్రిబ్యూటర్ రమేష్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ వారి సహకారంతో బస్టాండ్ రోడ్ లోని కరెంట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి బల్బుల క్యాంపులో కొనుగోలు చేసిన బల్బులకు 3 సంవత్సరాల వారంటీ ఉంటుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు అందరు గత మూడు నెలలలోని క్యాటగిరి 1 కింద ఉన్న కరెంటు బిల్లు తీసుకొని వచ్చి 125 రూపాయలకు 5 ఎల్‌ఈడి బల్బులను తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

అదేవిధంగా పనిచేస్తున్న పాత ఎర్ర బల్బులు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఒక్కొక్క బల్బుకు పది రూపాయలు చొప్పున అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర కాంప్ ఇంచార్జి మాలతి, అభిజిత్ లతో పాటు విద్యుత్ వినియోగదారులు వ్యాపారి పురుషోత్తం, హోమియో హాస్పిటల్ డాక్టర్ కిలారు కామేశ్వరరావు, మాటూర్ ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News