Sunday, April 28, 2024

ఆ ఒక్కదానితో సరిపెట్టుకోండి

- Advertisement -
- Advertisement -

Letter from Telangana Govt to Godavari River Ownership Board

పెద్దవాగు మినహా మిగతా ప్రాజెక్టుల జోలికి పోవద్దు

గోదావరి నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్యబోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఘాటు లేఖ రాసింది. గత లేఖల ద్వారా తెలిపిన విధంగా ్ర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తమ ప్రభుత్వం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని , సంబంధిత అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చేంత వరకూ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించటం సాధ్యం కాదని లేఖలో వివరించారు. బోర్డులో చర్చ అనంతరం అగీకారం కుదిరిన ప్రాజెక్టులను మాత్రమే అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలిపారు. గోదావరిపైన పెద్దవాగు ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టుల స్వాధీనం అవసరం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సాగునీటిని అందించే ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి బోర్డులో నిర్ణయాలు లేకుండా బోర్డు ఉపసంఘం ప్రాజెక్టులను సందర్శించి నివేదికలు సిద్దం చేయటం సరైన పద్దతి కాదన్నారు.బోర్డులో అంగీకారం కుదిరిన తర్వాతే ప్రాజెక్టులను సందర్శించాలన్నారు. ఇటీవల గోదావరి బోర్డు ఉపసంఘం బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో మంజీరా నదిపై ఉన్న సింగూరు, నిజాంసాగర్, ప్రాజెక్టులతోపాటు శ్రీరాంసాగర్ , గుత్ప ఎత్తిపోతల పథకాలను సందర్శించించింది. ప్రాజెక్టుల్లో వరదనీటి ప్రవాహాల సామర్ధం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా సేకరించింది. ఈనెల 17న గోదావరి బోర్డు ఉపసంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉపసంఘం ప్రాజెక్టుల సందర్శన ద్వారా అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో నివేదిక రూపొందించింది.

ఈ నివేదికనే ఉపసంఘం సమావేశంలో చర్చకు పెట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరం తెలిపారు. తెలగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా, ఉపసంఘం పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండానే నివేదికలు సిద్దం చేసి ఉపసంఘంలో చర్చకు పెట్టడమేమిటని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలనుకుంటే తొలుత ఆ ప్రాజెక్టులపై బోర్డులో చర్చించి అంగీకారం పొందాకే అధికారికంగా ప్రాజెక్టలను సందర్శించాలని కోరుతూ ఇఎన్‌సి మురళీధర్ గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు ఈ మేరకు లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News