Friday, April 19, 2024

ఎల్‌ఐసి ఐపిఒలో రిజర్వేషన్‌కు పాన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి..

- Advertisement -
- Advertisement -
LIC IPO for policyholders
ఫిబ్రవరి 28 వరకు గడువు

న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసి) పాలసీదారులు ఐపిఒలో రిజర్వేషన్ చేయాలనుకుంటే రెండు విషయాలను తప్పనిసరిగా పాటించాలి. దీనికి ముందుగా ఎల్‌ఐసి పోర్టల్‌లో పాన్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది డీమ్యాట్ ఖాతాను తెరవాలి. ఎల్‌ఐసి ఐపిఒ వచ్చే నెల మార్చిలో ప్రారంభం కావచ్చు. ఎల్‌ఐసి ఐపిఒలో 31,62,49,885 షేర్లు విక్రయించనున్నారు. అంటే 5 శాతం వాటాలను విక్రయించనున్నారు. వీటిలో 10 శాతం అంటే 3.16 కోట్ల షేర్లు ఎల్‌ఐసి పాలసీ ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ చేస్తారు. రిజర్వేషన్ ప్రయోజనం ఏమిటంటే ఎల్‌ఐసి పాలసీదారులకు వాటా కేటాయింపు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎల్‌ఐసి దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి) ప్రకారం, పాలసీదారులు తమ పాన్‌ను ఫిబ్రవరి 28 లోపు అప్‌డేట్ చేసుకుంటే రిజర్వేషన్ పొందుతారు.

ఎల్‌ఐసి పోర్టల్‌లో పాన్‌ను అప్‌డేట్ ఎలా?

ఎల్‌ఐసి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
ఇమెయిల్ ఐడి, పాన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, పాలసీ నంబర్‌ను నమోదు చేయాలి
బాక్స్‌లో క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఒటిపి కోసం రిక్వెస్ట్ చేయాలి
ఒటిపి వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేసి సబ్‌మిట్ చేయాలి.
ఫామ్‌ను సమర్పించిన తర్వాత సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ మెసేజ్ వస్తుంది.

పాన్ అప్‌డేట్ చెక్ చేసుకోవడం ఎలా?

ఎల్‌ఐసి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
పాలసీ నంబర్, పుట్టిన తేదీ, పాన్ సమాచారాన్ని, అలాగే క్యాప్చాను నమోదు చేయాలి, ఆ తర్వాత సబ్‌మిట్ చేయాలి.
ఆ తర్వాత పాన్ మీ పాలసీతో లింక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది.

డీమ్యాట్ ఖాతా తెరవాలి

పాలసీదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఎకౌంట్‌ను కల్గివుండాలి. లేకపోయినట్లయితే వెంటనే ఓపెన్ చేయండి. ఈక్విటీ మార్కెట్‌లో షేర్లను కొనడానికి, అమ్మడానికి డీమ్యాట్ ఖాతా అనేది అవసరమవుతుంది. డీమ్యాట్ ఖాతాను తెరవడానికి ఆధార్, పాన్ వివరాలు, అడ్రస్ ప్రూఫ్ వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాను ఆన్‌లైన్‌లో మాత్రమే తెరిచే వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News