Sunday, April 28, 2024

మైహోమ్‌లో లిఫ్ట్ కూలీ కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్ళచెర్వు మండల కేంద్రంలో ఉన్నటువంటి మైహోమ్ సిమెంట్ పరిశ్రమ లో మంగళవారం జరిగిన లిఫ్ట్‌వైర్ తెగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎటువంటి అనుమతులు లేకుండా 4వ సిమెంట్ యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఆ 4వ ప్లాంట్ నిర్మాణ ప్రదేశంలో పలువురు కార్మికులు పనులు చేస్తున్నారు. ఆయా కార్మికులల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన 8 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.

ప్లాంట్ వద్ద సుమారు 500 అడుగుల ఎత్తులో కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా లిఫ్ట్‌వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్ప కూలీపోవడంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. అందులో అరవింద్ సింగ్(28)అనే కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురు కా ర్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైన వారికి మెరుగైన చికిత్సను అందించడం కోసం ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం మరింతగా ఉందని సమాచారం. మృతిచెందిన కార్మికుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.

ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గుర య్యారు. గతంలో జరిగిన సంఘటనలు మరవకముందే మళ్ళీ ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీలో పనిచేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులకు రావాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయంటూ ఆవేదన చెందుతున్నారు. జరిగిన ప్రమాదంతో మేళ్ళచెర్వు ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగిన తర్వాత మీడియాను లోపలికి వెళ్ళనివ్వకుండా మహా సిమెంట్ యాజమాన్యం గేట్లు వేయడం జరిగింది.

కార్మికుల వద్దనున్న సెల్‌పోన్స్ తీసుకుని సిగ్నల్ జామర్లను కూడా ఏర్పాటు చేసి, పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులనందరినీ బయటకు పంపించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను మాత్రమే లోపలికి పంపించారనే ఆరోపణలు వచ్చాయి. లిఫ్ట్ వైరు తెగిపోవడానికి గల కారణాలు తెలి యాల్సివుంది. కార్మికులు కూడా ఎంతమంది మృతి చెందారనే విషయంపై పూర్తిసమాచారం తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News