Monday, April 29, 2024

అన్ని రకాల జబ్బులకు మహబూబ్‌నగర్‌లోనే వైద్యం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇకపై ప్రతి మంగళవారం గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్యశిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ వైద్య రంగంలో ఎంతో మార్పులు వచ్చాయని అన్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని వైద్య కళాశాలలు ఉన్నాయని, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉన్న చరిత్ర తెలంగాణకే ఉందని తెలిపారు.
70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండేవని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని, దీని వల్ల జిల్లాలో ఆసుపత్రులు అభివృద్ది చెంది పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్ ద్వారా 134 రకాల పరీక్షలను కార్పొరేట్ తరహాలో ఉచితంగా చేయడమే కాకుండా, అదే రోజు సాయంత్రమే సెల్ ఫోన్‌కు టెస్టుల ఫలితాలను తెలియజేయడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
గతంలో మహబూబ్‌నగర్ ప్రధాన ఆసుపత్రిలో కేవలం 15 మంది డాక్టర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 130 నుండి 140 పెరిగిందని, ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుండి 43 మందికి , ఒక ఫార్మసిస్టు నుండి 40 మందికి , 30 మంది నరుసుల నుండి 350 వరకు పెంచడంతో పాటు, అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇటీవలే రేడియాలజీ హబ్ ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధానసుపత్రికి కార్డియాలజీ పోస్టు మంజూరైనందున శాశ్వత డాక్టర్ నియామకానికి కృషి చేస్తున్నామని, అయితే పాత కలెక్టర్ స్థానంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటి వైద్యశాల త్వరలోనే పూర్తికానున్నందున క్యాథ్ ల్యాబ్‌తో పాటు, నూతన ఎంఆర్‌ఐ యంత్రాలను అక్కడ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ , ముడా చైర్మన్ గంజి వెంకన్న, నిమ్స్ మాజీ డైరెక్టర్ డి. ప్రసాద్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్, డిప్యూటీ ఆర్‌ఎంఓ, డాక్టర్ జీవన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణ, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిడా. భాస్కర్, హైదరాబాద్ నుండి వచ్చిన గుండె వైద్య నిపుణులు డా. కిరణ్, ఆసుపత్రి సలహ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News