Tuesday, May 14, 2024

లక్ష్మిబ్యారేజ్ వద్ద 12 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మిబ్యారేజ్ వద్ద గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదికి వరద నీరు చేరుకోవడం ద్వారా 12గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి 39,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు చేరుతుంది. 12గేట్లు ఎత్తడం ద్వారా 36,360 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండగా లక్ష్మీపంప్‌హౌస్ నుంచి 14,826 క్యూసెక్కుల వరద నీరు అన్నారం బ్యారేజికి చేరుతుంది. అలాగే ఈ రెండు ఔట్‌ఫ్లో కలిపి 51,186 వరదనీరు ఔట్‌లో ఉండగా ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్‌లో 12 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే గత కొన్ని రోజులుగా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి మోటార్లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. గత రాత్రి వరకు 5 టిఎంసిల నీటిని ఎత్తిపోయగా రేపటి వరకు 6 టిఎంసిల నీరు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అన్నారం బ్యారేజ్ వద్ద కన్నె పల్లి పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోసిన నీటి ద్వారా 14826 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సరస్వతి పంప్‌హౌస్ ద్వారా 17586 క్యూ సెక్కులు ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్నారం బ్యారేజ్ వద్ద 7 టిఎంసిల నీరు ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాంటి గేట్లు ఎత్తకుండా ప్రస్తుతం నీటిని నిల్వ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News