Sunday, April 28, 2024

లీటర్ పెట్రోల్‌ను రూ. 70కే విక్రయించడానికి సహకరించండి

- Advertisement -
- Advertisement -

మోడీ వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్

Liter petrol cost is 70 Rupees

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం చివరిలో చమురు ధరల పెంపుపై బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసి ప్రధాని మాట్లాడారు. తాను విమర్శించడం లేదని, కేవలం అప్పీల్ చేస్తున్నానని, వ్యాట్ పెంచకుండా ప్రజల సంక్షేమం కోసం తక్కువ ధరలకే చమురు అందించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మినిస్టర్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆయన తన ట్వీట్లను కేంద్ర ప్రభుత్వాన్ని నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్ (ఎన్‌పీఏ/ నిరర్ధక ఆస్తి)గా విమర్శిస్తూ మొదలు పెట్టారు. అసలు తాము వ్యాట్ పెంచనేలేదని, కానీ, పేరు పెట్టి మరీ ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడే సహకార సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చమురుపై వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. కేవలం ఒకే సారి రౌండ్ ఆఫ్ చేశారని వివరించారు.

మరో ట్వీట్‌లో వన్ నేషన్ వన్ ప్రైస్? (ఒక దేశం – ఒకే ధర)ను అమలు చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. చమురుపై హక్కుగా లభించే 41 శాతం వాటా తమకు లభించడం లేదని, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ వల్లే ఈ నష్టం తమకు వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సెస్ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం 11.4 శాతం వాటా కొట్టేస్తున్నదని, 2023 ఆర్థిక సంవత్సరంలో తమకు కేవలం 29.6 శాతం మాత్రమే దక్కుతున్నదని వివరించారు. దయచేసి సెస్‌ను ఎత్తేయండని కోరారు. తద్వార దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌ను రూ. 70కి, డీజిల్‌ను రూ. 60కి తాము అందించగలుగుతామని పేర్కొన్నారు. వన్ నేషన్ – వన్ ప్రైస్ సాధ్యం అవుతుంది కదా? అన్నట్టుగా ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News