మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్’. (Little Heart) ఈ చిత్రా న్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ “లిటిల్ హార్ట్ కథను ఫస్ట్ మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్ నమ్మారు. అలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మారాను”అని అన్నారు.
ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ “ఈ సినిమా ప్రివ్యూను వంశీ, బన్నీ వాస్ చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నారు. వాళ్లిద్దరికీ ఈ మూవీ థియేట్రికల్‌గా పెద్ద సక్సెస్ (huge theatrical success) అందిస్తుందని నమ్ముతున్నా”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 12న థియేటర్స్ లో ఈ సినిమా చూసే ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా నవ్వుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, హీరో మౌళి తనుజ్, హీరోయిన్ శివానీ నాగరం పాల్గొన్నారు.