Wednesday, August 6, 2025

సముద్ర రవాణా బిల్లుకు పార్లమెంట్ సమ్మతి

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాల నిరసనలు గందరగోళం నడుమనే పార్లమెంట్ బుధవారం సముద్ర మార్గాల ద్వారా సరుకుల రవాణా బిల్లుకు ఆమోదం తెలిపింది. సర్‌పై రాజ్యసభలో విపక్షాలు నిరసనలకు దిగిన దశలోనే ఈ బిల్లు ఆమోదం పొందింది. 1925 నాటి పాత సీ యాక్ట్‌కు బదులుగా ఈ చట్టం అమలులోకి వస్తుంది. సముద్ర మార్గాల ద్వారా సరుకుల రవాణాను మరింత సులభతరం చేసేందుకు, భారతీయ ఎగుమతిదార్లకు ఇతరత్రా భాగస్వామ్య పక్షాలకు చట్టం మరింత అందుబాటులో ఉండేలా చేసేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. బిల్లును కేంద్ర రేవులు , నౌకారవాణా, జలమార్గాల సహాయ మంత్రి శంతాను ఠాకూర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఈ ఏడాది మార్చిలోనే ఆమోదం దక్కింది. ఇప్పుడు ఎగువ సభ ఆమోదం దక్కింది. సర్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్ట దశలోనే ఈ బిల్లుపై సంక్షిప్తంగా చర్చ తరువాత ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News